Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'ఖైథీ'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతుంది. తాజాగా శనివారం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో కార్తీ ఖైదీ పాత్రలో కనిపిస్తున్నారు. ఓ చేతికి బేడీలు వేసుకుని, లారీ డ్రైవ్ చేస్తూ యారగెంట్ లుక్‌లో కార్తీ కనిపిస్తున్నారు.
ఇందులో ఓ ఫొటోని చూపించి 'ఇతడి తల తెచ్చిన వాడికి జీవితాంతం బతికేందుకు కావాల్సినంత డబ్బు ఇస్తా' అని విలన్ ఇతర రౌడీలకు చెప్పడం, అతని కోసం రౌడీలు వెంటాడటం, రౌడీలని కార్తీ మట్టుపెట్టడం, చివరకు కార్తీ పోలీస్ స్టేషన్ ముందే చికెన్ బిర్యానీ తింటూ ఉండే సన్నివేశాలు టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. ఓ రాత్రి ఏం జరిగిందనే కథాంశంతో
ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నరైన్, జార్జ్ మర్యాన్, రమణ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది.