Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఇందులో నా పాత్ర ఏంటనేది సస్పెన్స్. కథలో కొన్ని ప్రశ్నలకు నా పాత్ర ద్వారా సమాధానం లభిస్తుంది. గత పాత్రలతో పోల్చితే ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేశా. నా రోల్‌కి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇందులో నాకు ముద్దు సీన్లు ఉండవు. హవీష్ స్వీట్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీ. తను డెడికేటెడ్ యాక్టర్. ఇందులో ఆరుగురు కథానాయికలుంటారు. కానీ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి కథ వాళ్ళది. చివరికి మాత్రం అన్ని కథలు కలుస్తాయి. ప్రతి కథకి హీరో హవీష్. రెజీనాతో నాకు కొన్ని సీన్లు ఉంటాయి. దర్శకుడు నిజార్ చాలా ప్రతిభ గల కెమెరామెన్. ఈ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుంటారు. నాకిది మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఈ సినిమాతోనే కోలీవుడ్‌కి పరిచయం కావడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న 'కల్కి'లో నటిస్తున్న. విభిన్నమైనా పాత్ర నాది. గిరిజన యువతిగా కనిపిస్తా. దీంతోపాటు కీర్తిసురేష్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. అలాగే తమిళంలో ఓ సినిమాకి సైన్ చేశాను.