Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను'
అని అంటున్నారు నటుడు రెహమాన్. విభిన్న పాత్రలతో ఆల్‌రౌండర్‌గా మెప్పిస్తున్నారు రెహమాన్. ఇటీవల 'డి16' సినిమాతో సోలోగా భారీ విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆయన 'సెవెన్' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. హవీష్ హీరోగా,
నిజార్ షఫీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
'దాదాపు 30 ఏండ్లుగా దక్షిణాదిలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాను. అన్నీ తరహా పాత్రలు పోషించగలననే గుర్తింపు రావడం చాలా హ్యాపీగా ఉంది. తాజాగా 'సెవెన్'లో కీలక పాత్ర పోషిస్తున్నా. నా కెరీర్లో చెసిన ది బెస్ట్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆడియెన్స్ ఎంజారు చేస్తారు. ఇది నాకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. దీంతోపాటు మలయాళంలో 'వైరస్' అనే సినిమాలో కీలక పాత్ర పోషించాను. ఇది ఈనెల 7 న రిలీజ్ అవుతుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ నా సినిమాలు విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు.