Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారుణ్య చౌదరి, బేబి సాయితేజస్విని(మహానటి ఫేమ్) ప్రధాన పాత్రధారులుగా బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై చెరువుపల్లి సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఎర్రచీర'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం జరిగింది. అతిధులుగా విచ్చేసిన నటుడు రాజేంద్రప్రసాద్, ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడి ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'ఫస్ట్ లుక్‌లో హర్రర్ కోణం కనిపిస్తుంది. సాయి తేజస్వీని వయసులో చిన్నదైనా చక్కగా నటించింది. సాయితేజస్వీని భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. రాజేంద్ర ప్రసాద్‌ని డాడి అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. 'సరిలేరు నీకెవ్వరు'లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు కాంబినేషన్లో ఆయనకు మంచి సన్నివేశాలున్నాయి' అని అన్నారు. 'సాయితేజస్వీని లుక్ చాలా పవర్ ఫుల్‌గా ఉందని పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇలాంటి ఫీలింగ్ కొన్ని సినిమాలకే కల్గుతుంది. చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తేనే మాలాంటి వాళ్లకు అవకాశాలు వస్తాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి' అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. చిత్ర దర్శకుడు సుమన్‌బాబు మాట్లాడుతూ, 'పోస్టర్ చూసి ఇది హర్రర్ థ్రిల్లర్ సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ ఉన్న కథ. కేవలం హర్రర్‌ని టచ్ చేశాం. సినిమా బాగా వస్తోంది. విజయంపై ధీమాగా ఉన్నాం. 'ఎఫ్2' సినిమా చూసిన తర్వాత దర్శకుడు అనీల్‌కి పెద్ద అభిమానిని అయిపోయా. ఆయన చేతులు మీదుగా నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉంది' అని తెలిపారు. 'ఇందులో నేను సాయితేజస్వీని తండ్రి పాత్ర పోషించా. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది' అని కమల్ కామరాజు తెలిపారు.