Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్ కామెడీ సినిమాలకు కేరాఫ్. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం లేదు. ఈ నేపథ్యంలో ఇతర స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మహేష్‌బాబు నటించిన 'మహర్షి'లో ఆయనకు స్నేహితుడిగా రవి పాత్రలో నటించారు. బలమైన పాత్రలో రైతుల కోసం పోరాడే వ్యక్తిగా మెప్పించారు. తాజాగా మరో స్టార్‌తో కలిసి నటించేందుకు నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవితేజతో కలిసి 'డిస్కోరాజా' సినిమాలో కీలక పాత్రలో మెరవబోతున్నారు. అయితే ఇందులో మొదట సునీల్‌ని అనుకున్నప్పటికీ పలు కారణాలతో ఆ స్థానంలో అల్లరి నరేష్‌ని ఫైనల్ చేశారట. రవితేజ మార్క్ ఎనర్జిటిక్ ఎంటర్టైన్మెంట్కి అల్లరి నరేష్ వినోదం తోడైతే అభిమానులకది మంచి వినోదాల విందు అని చెప్పొచ్చు. వీఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపు అల్లరి నరేష్ హీరోగానూ ఓ సినిమా రూపొందబోతుంది.