Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లుగా మధునారాయణ్ ముఖ్య పాత్రలో దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ, ఏ.జి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రకాష్ ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం 'లాస్ట్ సీన్'. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల దర్శకుడు కోదండరామిరెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దీపక్ నాకు చాలా రోజులుగా తెలుసు. మంచి కథని ఎంపిక చేసుకుని ఈ సినిమాని రూపొందించారనుకున్నా. ట్రైలర్ చూశాక నా గెస్ కరెక్ట్ అనిపించింది. ఈ చిత్రం దీపక్కి మంచి పేరు తీసుకురావాలి' అని అన్నారు. 'ట్రైలర్లో దీపక్ టాలెంట్ చూశా. చిత్ర బృందానికి అభినందనలు' అని దర్శకుడు మణికంఠ తెలిపారు. హీరో హర్ష కుమార్ మాట్లాడుతూ, 'ఇందులో లీడ్ రోల్ ఇచ్చి నా మీద నమ్మకం ఉంచిన నా గురువు దీపక్ సార్‌కి నా పాదాభివందనం. సపోర్ట్ చేసిన చిత్ర బృందానికి ధన్యవాదాలు' అని చెప్పారు.