Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నన్నుదోచుకుందువటే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన
నభా నటేష్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో స్టార్ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది. అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
'ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని 'దిమాక్ ఖరాబ్'
లిరికల్ వీడియోలో నభా తన అందచందాలతో మైమరపించింది. ఈ లిరికల్ వీడియోప్రస్తుతం ఇండియా వైడ్ 3వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. చాలా తక్కువ మంది కథానాయికలు మాత్రమే అందం, అభినయ సామర్ధ్యంతో మెప్పించగలరు. వారిలో నభా పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ప్రస్తుతం రవితేజతో 'డిస్కో రాజా', రామ్‌తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలతో బిజీగా ఉన్న నభాకు టాలీవుడ్ నుంచి మంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే ఆమె 'డిస్కోరాజా' షూటింగ్‌లోనూ పాల్గొంది. రవితేజతో కలిసి నటించబోయే ఈ సినిమా గురించి నభా చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఈ సినిమాలో రవితేజతో కలిసి ఆమె
నటించబోయే కామెడీ సీన్స్‌తో పాటు అందర్నీ సర్ప్రైజ్ చేసే సీన్స్ అలరిస్తాయట' అని సభా సన్నిహితులు చెబుతున్నారు. 'నభా కామెడీ టైమింగ్ 'నన్ను దోచుకోందువటే' ట్రైలర్లో చూసినప్పుడు బాగానచ్చింది. అందుకే ఆ సినిమా విడుదలకు ముందే ఆమెను 'డిస్కో రాజా' సినిమా కోసం ఎంపిక చేశాం' అని డిస్కో రాజా టీమ్ మెంబర్ తెలిపారు.''నభాతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఆమె చాలా ఎనర్జిటిక్, యాక్టివ్. ఆమె ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాలా క్రేజీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు' అని ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం తెలిపింది.