Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంజలి, లక్ష్మీరారు ప్రధాన పాత్రల్లో, ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రధారిగా నటిస్తున్న చిత్రం 'ఆనంద భైరవి'. హరి వేన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కర్రీ బాలాజీ దర్శకత్వంలో ఇటికేల రమేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తయ్యింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఇటికేల రమేష్‌రెడ్డి మాట్లాడుతూ,'అందమైన విశాఖపట్నంలో అందమైన జంట అంజలి, ఆదిత్ అరుణ్‌పై దర్శకుడు చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు అంతే అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. పృధ్వీ, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్, జయవాణిలపై షూట్ చేసిన కామెడీ సన్నివేశాలు అందరినీ పడి పడి నవ్విస్తాయి. భారీ వ్యయంతో ఎక్కడా రాజీపడకుండా ఈ షెడ్యూల్‌ని పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుంది' అని చెప్పారు.
'ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం అంజలి చాలా వర్కవుట్స్ చేసి స్లిమ్ అయ్యారు. ఆనందిని పాత్రని అంజలి ప్రేమించిన విధానం, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా తన హావభావాల్ని ఆ పాత్రలో ప్రదర్శించడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. షూటింగ్ చేస్తున్నప్పుడు స్కూటీ మీద నుంచి పడి గాయాలైనప్పటికీ ఆమె లెక్కచేయకుండా నటించారు. పని పట్ల ఆమెకి ఉన్న శ్రద్ధ, దీక్ష యూనిట్ అందర్నీ ఇన్స్పైర్ చేసింది. ఇప్పటివరకు అంజలి నటించిన చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పైగా చాలా మెర్చ్యూర్డ్గా నటించింది. ఆమె నటన అందర్నీ ఫిదా చేస్తుంది. ఇందులో అంజలి, ఆదిత్ అరుణ్‌ల కెమిస్ట్రీ చూస్తే ఈ చిత్ర విజయం నా కళ్ళ ముందు కనిపిస్తోంది. కెమెరామెన్ పి.జి.విందా కెమెరా పనితనం, మణిశర్మగారి సంగీతం, నిర్మాత రమేష్రెడ్డిగారి ప్రోత్సాహం నన్ను మరింత ప్రోత్సహిస్తున్నాయి. తదుపరి షెడ్యూల్లో లక్ష్మీరారుపై యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం' అని దర్శకుడు కర్రీ బాలాజీ చెప్పారు. సుమన్, బ్రహ్మాజీ, మురళీశర్మ, జయప్రకాష్, కళ్యాణి, ఆశీష్‌విద్యార్థి, పృథ్వీ, గుండు సుదర్శన్, జయవాణి, గిరి, మణిచందన, ప్రభాస్ శ్రీను, సుబ్బరాయశర్మ, ధన్‌రాజ్, ఐశ్వర్య, విద్యుల్లేఖరామన్, బాహుబలి ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, పర్వీన్‌రాజ్, దినేష్,రాహుల్, సాత్విక్, శ్రీ హర్ష తదితరులు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సురేష్ దత్తి, ఎడిటింగ్ : ఛోటా.కె.ప్రసాద్, కెమెరా : పి.జి.విందా, సంగీతం: మణిశర్మ.