Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి యూనిట్ తెలియజేస్తూ, 'సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్‌ని రామ్, నిధి అగర్వాల్‌లపై మాల్దీవుల్లో చిత్రీకరిస్తున్నాం. భాస్కరభట్ల రచించిన ఈ 'లవ్..' సాంగ్‌ని మాల్దీవుల్లోని అందమైన లొకేషన్లలో షూట్ చేస్తున్నాం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కి, 'దిమాక్ ఖరాబ్..' పాటకి ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. తాజాగా విడుదల చేసిన 'జిందాబాద్.. జిందాబాద్' పాట సైతం శ్రోతలను అలరిస్తుంది. ఫస్ట్‌టైమ్ రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఇందులో రామ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. కచ్చితంగా సినిమా అన్ని వర్గాలను ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై 12న సినిమాని విడుదల చేయనున్నాం' అని తెలిపింది. పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్: జానీ షేక్, కెమెరా: రాజ్ తోట.