Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతూ రూపొందుతున్న చిత్రం 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్'. నూతన దర్శకుడు శ్రీనాథ్ పులకరం దర్శకత్వంలో బిజెఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ పతాకంపై నిర్మితమైంది. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఆదివారం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, 'గౌతంరాజు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానని చెప్పగానే ఎందుకు ఇంత రిస్క్ చేశావ్ అని అడిగితే, నేను నా కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. అది నా కోరిక అని సమాధానమిచ్చారు. ఇందులో ఒక పాట నాకెంతో బాగా నచ్చింది. రెండున్నర గంటలు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మీ అందరి ఆశీర్వాదాలు ఈ చిత్ర యూనిట్‌కి ఉండాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'ఈ సినిమాలు అన్ని పాత్రలు చాలా బాగా కుదిరాయి. ఇలాంటి సినిమాల్లోనే మాకు చాలా ప్రత్యేకమైన పాత్రలుంటాయి. మాకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. తర్వాత సీన్ ఏంటనే క్యూరియాసిటీ కలిగిలే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌతంరాజు కోసం చాలా మంది వచ్చారు. ఆయన పడుతున్న తపనకి మంచి ఫలితం రావాలని ఆశిస్తున్నాను' అని తనికెళ్ళభరణి అన్నారు. 'ఈ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ ఈ సినిమాని గొప్పగా తీశారు. కొడుకు కోసం గౌతంరాజు పడుతున్న తపనకి హ్యాట్సాఫ్' అని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. 'ఫస్ట్‌కాపీ వచ్చింది. సినిమా అవుట్‌ఫుట్ అందరికీ బాగా నచ్చింది. సినిమా ఇంట్రవెల్ వరకు ఓ ఎత్తు, తర్వాత మరో ఎత్తు. ప్రేక్షకుల్ని తల తిప్పనియ్యదు. ఈ సినిమా కోసం చాలా మంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కృతజ్ఞతలు' అని గౌతంరాజు చెప్పారు.
'నా కెరీర్‌కి ఇదొక మంచి సినిమా అవుతుంది. సినిమాలోని ఆరు ఫైట్లు, రీ-రికార్డింగ్, ఎడిటింగ్. సీజి వర్క్ ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అవుట్‌ఫుట్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం అందరం ఎంతో సిన్సియర్‌గా కష్టపడ్డాం. మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను' అని కథానాయకుడు కృష్ణ చెప్పారు. ఈ వేడుకలో కథానాయిక ఎల్సా, దర్శకుడు శ్రీనాథ్ పులకురమ్, అశోక్‌కుమార్, సంతోష్‌కుమార్, రంగరాజు, రవికుమార్, కాశీ, బెనర్జీ, రవిప్రకాష్, మాధవ్, కందికొండ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.