Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదీప్ హీరోగా ఆకాంక్ష సింగ్ కథానాయికగా ఎస్.కృష్ణ దర్శకత్వంలో కన్నడలో రూపొందుతున్న చిత్రం 'పహిల్వాన్'. ఈ సినిమాని వారాహి చలన చిత్ర పతాకంపై తెలుగులో అదే పేరుతో అందించనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'యాక్షన్ డ్రామాగా సినిమా రూపొందుతుంది. ఇందులో కిచ్చా సుదీప్ రెజ్లర్‌గా కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చిరంజీవి విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌లుక్‌కి విశేషమైన స్పందన లభిస్తుంది. అలాగే విడుదలైన మొదటి లిరికల్ వీడియోకి కూడా స్పందన బాగుంది. అర్జున్ జన్యా మంచి మ్యూజిక్ అందించారు. కరుణాకర్ కెమెరా వర్క్ హైలైట్‌గా నిలుస్తుంది. గతేడాది మా బ్యానర్లో 'కేజీఎఫ్' చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాని కూడా గ్రాండ్‌గా ఆగస్ట్ 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.