Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడలింగ్ స్టార్స్ సమీర్‌ఖాన్, శైలజ నాయకానాయికలుగా షేర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కెఎస్ 100'. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈచిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు సమీర్‌ఖాన్ మాట్లాడుతూ,'ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా మా సినిమాని ఇష్టపడుతున్నారు. నటుడిగా ఈ చిత్రం నాకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. నా నటనతోపాటు ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని చెప్పారు. 'ఈ సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలైన తర్వాత మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. చిన్న సినిమాగా విడుదలై సైలెంట్‌గా హిట్ అయ్యింది. ఈ సినిమాతో మా అందరికీ మంచి గుర్తింపు లభించింది' అని దర్శకుడు షేర్ అన్నారు. 'ఈనెల 12న దాదాపు 200 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. యూత్ బాగా చూస్తున్నారు. విడుదలైన అన్ని థియేటర్లలోనూ సినిమా బాగా ఆడుతోంది. ఒక మంచి ట్రెండీ సినిమా తీస్తే ఆదరణ ఎలా ఉంటుందో చెప్పడానికి మా సినిమానే ఉదాహరణ. మంచి ఎంటర్టైన్మెంట్తోపాటు ఆలోచింపజేసే రీతిలో సందేశాన్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడు షేర్ అద్భుతంగా ఆవిష్కరించారు' అని నిర్మాత వెంకట్‌రెడ్డి చెప్పారు. సంగీత దర్శకుడిగా తన పనితనానికి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు నవనీత్ తెలిపారు. 'ఐదు సినిమాల మధ్య విడుదలైన మా చిత్రానికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు మిగిలిన సినిమాలతో పోలిస్తే అద్భుతంగా ఆడుతోంది' అని సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫారూఖ్ చెప్పారు.