Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ అలరించింది. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను అంటూ ఐదు పాత్రలను పరిచయం చేస్తున్న ఫస్ట్‌లుక్‌ని నాని విడుదల చేశారు. పోస్టర్లో ఐదుగురు భిన్న వయస్సున్న ఆడవారితో కలిసి బైనాక్యూలర్ పట్టుకుని ఉన్న నాని లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్యాంగ్ ఎవరో?, ఈ గ్యాంగ్‌కి లీడర్ ఎవరో అందరికీ తెలిసేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ అందరిలోనూ అంచనాలను పెంచింది. బైనాక్యూలర్స్ పట్టుకున్న ఈ గ్యాంగ్ ఏం చేయబోతోందనే క్యూరియాసిటీని అందరిలో క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని ఈనెల 18, టీజర్‌ని ఈనెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఆసక్తికర పాయింట్‌తో డిఫరెంట్ లుక్‌తో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఓ ప్రధాన పాత్రలో ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న ఈచిత్రంలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్ళా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెలకిషోర్, జైజా, సత్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.