Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ కథానాయికలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని అందరూ అనుకుంటున్న తరుణంలో దీనికి తాను మాత్రం మినహాయింపు అని అంటోంది కాజల్. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో నటిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా బాలీవుడ్లోనూ సత్తా చాటేందుకు కాజల్ ప్రయత్నిస్తోంది. ఇటీవల 'సీత' చిత్రంలోని తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన కాజల్ ఒకేరోజు రెండు సినిమాలతో సందడి చేయనుంది.
అందులో ఒకటి 'రణరంగం'. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిని మరో కథానాయిక. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇదే రోజు కాజల్ నటించిన తమిళ సినిమా 'కోమలి' కూడా రిలీజ్ అవుతోంది. జయం రవి హీరోగా ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. విభిన్న కథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సైతం ఇండిపెండెంట్ డే కానుకగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. దీంతో కాజల్ ఇటు తెలుగు ప్రేక్షకుల్ని, అటు తమిళ ప్రేక్షకుల్ని ఒకేసారి మెస్మరైజ్ చేయబోతుంది. ఒక కథానాయికకి చెందిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన విషయం కాజల్ లాంటి సీనియర్ కథానాయిక విషయంలో జరగడం విశేషం. వీటితోపాటు కాజల్ ప్రస్తుతం 'పారిస్ పారిస్', 'ఇండియన్ 2' చిత్రాల్లో నటిస్తోంది.