Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజీజ్ నాజర్, అలీ రజిత్, ఫరా ఖాన్, సూఫీ ఖాన్, సమైరా హీరోహీరోయిన్లుగా ఉటోపియా ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ఆర్కే స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'హైదరాబాద్ నవాబ్ 2'. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆర్కే మాట్లాడుతూ, 'ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో రియల్ ఎస్టేట్ నేపథ్యంలో సెటైరికల్ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. రియల్ ఎస్టేట్‌లోని మోసాలను, అక్రమ నిర్మాణాలను హాస్య భరితంగా చూపించబోతున్నాం. అలాగే మన హైదరాబాద్ కల్చర్‌ని చూపిస్తున్నాం. ఇది హిందీ సినిమా కాదు, తెలుగు చిత్రం కాదు, హైదరాబాదీ సినిమా. ఇందులో నేను మామ పాత్ర పోషించా. ఆర్టిస్టులు బాగా నటించారు. సినిమాలో అన్ని రకాలు షేడ్స్ ఉంటాయి. కచ్చితంగా అన్ని వర్గాల ఆడియెన్స్‌ని నవ్విస్తుంది' అని అన్నారు.
'ఇందులో మంచి పాత్ర పోషించా. 'హైదరాబాద్ నవాబ్' పెద్ద హిట్ అయ్యింది. ఇది కూడా సక్సెస్ అయి పేరు, డబ్బులు రావాలి' అని నటుడు కారుమంచి రఘు చెప్పారు. అజీజ్ మాట్లాడుతూ, 'సినిమాకి కథే హీరో. కామెడీ హైలైట్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. '2006లో వచ్చిన 'హైదరాబాద్ నవాబ్' చిత్రాన్ని నా ఫ్రెండ్స్‌తో కలిసి చూశా. ఇప్పుడు ఆ చిత్ర సీక్వెల్లో నటించే ఛాన్స్ నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో యాక్ట్ చేశాను. మూడు, నాలుగు సినిమాల్లో కూడా నటించాను. ఈ సినిమా చేసేటప్పుడు బాగా ఎంజారు చేశాం. సినిమా చూసేటప్పుడు ఆడియెన్స్ కూడా మాలాగే ఎంజారు చేస్తారని నమ్ముతున్నా' అని అలీ రజిత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజేష్, ఫరా ఖాన్, సూఫీ, సమైరా తదితరులు పాల్గొన్ని మరిన్ని చిత్ర విశేషాలు తెలియజేశారు.