Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ శివ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం 'మాస్ పవర్'. ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన యాభై రోజుల వేడుకలో శివ జొన్నల గడ్డ మాట్లాడుతూ,' 'పోలీస్ పవర్' చిత్రం తర్వాత నేను చేసిన మరో పవర్ఫుల్ చిత్రమిది. శక్తివంతమైన కథతో, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాని 50 రోజులు ఆడించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి ధన్యవాదాలు. ఈ చిత్ర విజయంతో త్వరలో 'సూపర్ పవర్' సినిమా చేయబోతున్నాం. ఆ సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగర్, ప్రసన్నకుమార్, హీరోయిన్ ప్రియా అగస్టిన్, మోహన్ వడ్లపట్ల, సాయి వెంకట్, టి.రామసత్యనారాయణ పాల్గొన్నారు.