Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లామరస్ పాత్రలతో, యాక్షన్ రోల్స్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోంది. లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఐవాన్ చబ్బక్ స్టూడియోలో నటనకు సంబంధించి జాక్వెలిన్ ఇటీవల శిక్షణ తీసుకుంది.
అది పూర్తి చేసుకుని ఇటీవల ముంబయి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె విభిన్నమైన కథా నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించాలను కుంటుందట.
ఆ విశేషాలను ఆమె చెబుతూ, 'పాటల్లో, డాన్సుల్లో మెరిసే రొటీన్ చిత్రాలకు ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటున్నా. పూర్తిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించు కోవాలనుకుంటున్నా. అందులో భాగంగా మరిన్ని యాక్షన్ చిత్రాలు చేయాలనుంది. అందుకోసం వెపన్స్ ఉపయోగించడం కూడా ట్రైన్ అయ్యాను' అని తెలిపింది. ఇదిలా ఉంటే, జాక్వెలిన్ నిర్మాతగా మారాలనుకుంటున్నారు. సొంత నిర్మాణ సంస్థని స్థాపించి, మధు మంతెనతో కలిసి వరుసగా యాక్షన్ ఫ్రాంఛైజీ చేయాలని భావిస్తున్నారట. దీనిపై ఆమె స్పందిస్తూ, 'నిర్మాతగా మొదటి చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లోనే సినిమాని ప్రారంభిస్తాం' అని చెప్పింది.