Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించారు. హీరోహీరోయిన్లు విజరు దేవరకొండ, రష్మిక ఈ చిత్రంలోని పాటలకు డాన్స్ చేయడంతోపాటు పలు విన్యాసాలు చేసి అలరించారు.
ఈ సందర్బంగా విజరు దేవరకొండ మాట్లాడుతూ, 'మనందరిలో చాలా భయాలుంటాయి. వాటిని వదిలేస్తేనే మనం గెలుస్తాం. నేను కూడా నటుడు కావాలనుకున్నప్పుడు భయపడ్డాను. మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అది మనకు దక్కుతుంది. ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నమే 'డియర్ కామ్రేడ్'. బెంగుళూరు, కొచ్చి, చెన్నైల్లో సినిమా మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించాం. ప్రేక్షకులు ప్రతిచోటా తమ ప్రేమని పంచారు. ఇంత ప్రేమకు థ్యాంక్స్ చెబితే సరిపోతుందా? అనిపించింది. ఈ నెల 26న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. దక్షిణాది భాషల్లో మేం చేసిన తొలి ప్రయత్నమిది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని అన్నారు.
'నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు. చిత్ర పరిశ్రమ శ్రేయస్కరం కాదన్నారు. నేను ప్రేమించిన దాని కోసం కష్టపడ్డాను. అందరినీ ఒప్పించాను. అలానే ఇది ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. ఎవరైనా సరే ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలి' అని రష్మిక మందన్నా తెలిపారు.
'సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఇప్పటికే నాలుగు భాషల్లో విడుదలైన ట్రైలర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలకు భారీ స్పందన లభిస్తుంది. విజరు దేవరకొండ, రష్మిక జంట ఇంటెన్స్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయం' అని నిర్మాతలు చెప్పారు.