Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ బేబీ'తో అదిరిపోయే విజయాన్ని అందుకుని ఫుల్ జోష్‌లో ఉంది సమంత. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించగా, గత నెలలో విడుదలై భారీ కలెక్షన్లను సాధించింది. అలాగే ఇటీవల 'మన్మథుడు 2'లోనూ గెస్ట్‌గా మెరిసిన సమంత ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందట. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతుందని, ఇందులో సమంత పాల్గొంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మహిళా ప్రధానంగా సాగే వెబ్ సిరీస్ కావడం విశేషం. అంతేకాదు ఇందులో కూడా సమంత పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని వెబ్ సిరీస్ బృందం చెబుతోంది. 'యూటర్న్', 'ఓ బేబీ' తర్వాత సమంత మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోందని నిస్సంకోచంగా చెప్పొచ్చు. సమంత ప్రస్తుతం తమిళంలో విజయం సాధించిన '96' రీమేక్‌లో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి మాతృక దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.