Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణీందర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'. సోనాక్షి వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎం.ఆర్ సమర్పణలో అరిగెల ప్రొడక్షన్స్ పతాకంపై హర్షవర్ధన్ నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి మణీందర్ మాట్లాడుతూ, 'స్వచ్ఛమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ప్రేమతోపాటు మంచి భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోని విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, ఎడిటర్: నవనీత్.