Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) సంయుక్తంగా 'నాని'స్ గ్యాంగ్‌లీడర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయ విలన్‌గా, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రెండోపాట 'హోరునా హోరునా..' ని స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా గురువారం విడుదల చేశారు. 'సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన 'రారా.. జగతిని జయించుదాం..' అంటూ సాగే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా 'వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హౌరునా.. హౌరునా..హౌరునా..' అంటూ సాగే రెండో పాటను విడుదల చేశాం. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. విభిన్న కథాంశంతో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం అందర్నీ అలరించడం ఖాయం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేయనున్నాం' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, పొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి.