Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్య, సాహితి ప్రధాన పాత్రధారులుగా అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బోరు'. విశ్వరాజ్ క్రియేషన్స్ పతాకంపై
ఆర్.రవి శేఖర్‌రాజు, అమర్ విశ్వరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి చిత్ర బృందం చెబుతూ, 'హైస్కూల్ ఆఖరి
రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో దర్శకుడు అమర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియెన్, తన స్కూల్ జీవితంలోకి వెళతారు.
ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. మంచి ఫీల్‌గుడ్ చిత్రమవుతుంది. ఎల్విన్ జేమ్స్, జయప్రకాష్ జే అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెల 23న సినిమాని విడుదల చేయనున్నాం' అని అన్నారు. నీరజ్, వినరు వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిశూల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆష్కర్, ఎడిటర్: ఏకలవ్యన్.