Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలియాభట్ అద్భుతమైన నటి మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా. తాను నటించిన 'హైవే', 'హంప్టీ శర్మ కి దుల్హానియా', 'ఉడ్తా పంజాబ్', 'డియర్ జిందగీ', 'బద్రినాథ్ కి దుల్హనియా' వంటి తదితర చిత్రాల్లో పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. తాజాగా తొలిసారి ఆల్బమ్‌లో పాట పాడారు. 'డోర్ బీన్' అనే బ్యాండ్‌కి చెందిన ఓంకార్, గౌతమ్ కంపోజ్ చేసిన 'ప్రాడా..' అనే పాటలో తొలిసారిగా పాటపాడటంతోపాటు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ పాట కోసం ప్రాకీస్ట్ చేస్తున్న వీడియోని అలియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అలియా ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర', 'సడక్ 2', 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు త్వరలో సల్మాన్‌తో కలిసి 'ఇన్షాల్లా' చిత్రంలోనూ నటించనుంది. 'ఇన్షాల్లా' కోసం దర్శక, నిర్మాత సంజరు లీలా భన్సాలీ ఆఫర్ చేసినప్పుడు తన రియాక్షన్ గురించి అలియా చెబుతూ, 'ఆ టైమ్‌లో నేను ఇండియాలో లేను. నాకు భన్సాలీ సర్ నుంచి కాల్ వచ్చింది. ఈ ఆఫర్ గురించి చెప్పారు. అంతే పట్టలేనంత ఆనందంతో పరిగెత్తాను. ఓ ఐదు నిమిషాలపాటు కంటిన్యూగా ఎగురుతూనే ఉన్నాను. అంతగా ఎగ్జైట్ అయ్యాను' అని తెలిపింది.