Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. మొదటితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో చిరు చేసే యాక్షన్ హైలైట్‌గా నిలిచింది. అయితే సినిమాలో అన్ని యాక్షన్స్ సీక్వెన్స్‌లో, యుద్ధ సన్నివేశాల్లో స్వయంగా చిరునే చేశారట. ఎలాంటి డూప్ లేకుండా తానే స్వతహాగా పోరాట సన్నివేశాల్లో నటించినట్టు ఆయన చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా ట్రైన్ అవ్వడమే కాకుండా, వీటిని ఎంతో ఇష్టంగా చేసినట్టు తెలిపారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు, రవికిషన్, నిహారిక ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. చిరంజీవి పుట్టిన రోజు (ఈ నెల 22) సందర్భంగా ఈ నెల 20నచిత్ర టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఇటీవలే ఆయన డబ్బింగ్ చెప్పారు. దీంతో టీజర్‌పై, అటు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.