Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్, సాహితి ప్రధాన పాత్రధారులుగా అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో విశ్వరాజ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'బాయ్'. నీరజ్, వినరు వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిశూల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం వైభవంగా జరిగింది. ఎల్విన్ జేమ్స్, జయప్రకాష్.జె సంగీతం అందించిన చిత్ర ఆడియో బిగ్ సీడీని అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చూస్తుంటే సినిమాలో నిజాయితీ కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. దర్శక, నిర్మాతలకిది తొలి చిత్రం. సాధారణంగా తొలి సినిమాని కమర్షియల్‌గానో, లవ్ స్టోరీనో చేయొచ్చు. కానీ 'బారు' లాంటి విభిన్న కథా చిత్రం చేయడం, అది కూడా 14, 15 ఏండ్లున్న పిల్లలతో చేయడం గొప్ప విషయం. సినిమా బ్యాక్‌డ్రాప్ నాకు ఎంతగానో నచ్చింది. గత నాలుగైదేండ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఈ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులు బ్యాక్‌బోన్. ఇందులో అబ్బాయి పాత్ర కోసం దేశం మొత్తం తిరిగా. చివరకు ఆష్కర్ లక్ష్ని ఎంపిక చేశాం. తను ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అవుతాడు. తను దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాహితి కూచిపూడి డ్యాన్సర్. అద్భుతంగా నటించింది. నేను రాసిన కథను నటీనటులే క్యారీ చేశారు. ఎలా తీశాననేది సినిమానే చెబుతుంది. ఈ నెల 23న సినిమాని విడుదల చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నా' అని చిత్ర దర్శకుడు అమర్ విశ్వరాజ్ తెలిపారు.
లక్ష్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వరాజ్ క్రియేషన్స్ నా సెకండ్ ఫ్యామిలీలా మారిపోయింది. అమర్‌గారికి, నిర్మాతలకు థ్యాంక్స్' అని చెప్పారు. 'చిత్ర దర్శకుడు అమర్ సినిమాని అందంగా డిజైన్ చేశారు. అష్కర్ మా వెన్నంటే ఉండి నడిపించారు' అని సాహితి తెలిపారు.