Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మా' హామీల కోసం సంస్థలోని మూలధనం ఖర్చు చేయడం సరైనది కాదు. అందుకే రూ.పది లక్షలు 'మా'కి విరాళంగా ఇస్తున్నాం' అని నటుడు, 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధుల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, 'ఇంత వరకు 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ సారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నాం. చిత్ర పరిశ్రమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తాం' అని చెప్పారు. ఈ సందర్భంగా 'మా' కార్యవర్గం రాజశేఖర్‌కి ధన్యవాదాలు తెలిపారు.