Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అథర్వా, అనైకా సోటి మిస్తీ జంటగా శుభకారి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'డస్టర్ 1212'. బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ (వినరు) నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'మురళీగారి తనయుడు అథర్వా చాలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. మురళీగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'హృదయం' సినిమాతో ఆయన అందరి హృదయాలపై చెరగని ముద్ర వేశారు. వాళ్ళబ్బాయి హీరోగా చేసిన సినిమా తెలుగులో విడుదలవ్వబోతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద హిట్ అవ్వాలని, నిర్మాత వినరుకి మంచి గుర్తింపుతోపాటు డబ్బులూ రావాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'మా శుభకరి క్రియేషన్స్ బ్యానర్లో ఇది మా రెండవ చిత్రం. ఇదొక బ్యాచ్‌లర్ సాఫ్ట్వేర్ ఎంప్లారు యదార్థగాధ. మా సినిమా పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో జి.కె.రెడ్డి (విశాల్ ఫాదర్) ముఖ్య పాత్ర పోషించారు. కరుణాకరన్, మనోబాల కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత విద్యాసాగర్ (వినరు) చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్‌రాజా, డైలాగ్స్: రాజశేఖర్‌రెడ్డి, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్., సినిమాటోగ్రఫీ : అమర్నాథ్.