Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటి సారి అలియాభట్‌కి సంజరులీలా భన్సాలీ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఆయన రూపొందించే 'ఇన్షాల్లా'లో కథానాయికగా ఎంపికైన విషయం విదితమే. ఈ ప్రాజెక్ట్ నుంచి సల్మాన్ తప్పుకున్నారు. అయితే 'ఇన్షాల్లా'లో అలియా కూడా నటించడం లేదట. పూర్తిగా మరో స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమా ఉంటుందట. ఈ నేపథ్యంలో మరో భన్సాలీ సినిమాలో అలియా హీరోయిన్గా నటించబోతుందట. ముంబయి డాన్‌గా పాపులర్ అయిన మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా రూపొందించే 'గంగూబాయి' చిత్రంలో టైటిల్ రోల్‌ని అలియా పోషించనున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రాని భన్సాలీ ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానంలో అలియాని ఫైనల్ చేశారు. ముంబయి రెడ్‌లైట్ ఏరియా కమతిపురలో వేశ్యగృహాలను నడిపిస్తూ లేడీ మాఫియా డాన్‌గా వెలిగిన గంగూబాయి జీవితం ప్రధానంగా ఎస్ హుసేన్ జైదియాల్త్ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి' అనే బుక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. మరోవైపు అలియా తెలుగులో ఎంట్రీ ఇస్తూ 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తుంది. అలాగే హిందీలో 'బ్రహ్మస్త్ర','సడక్ 2'లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన 'ఐఫా' వేడుకలో 'రాజీ' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా అవార్డునందుకుంది.