Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పులకరం దర్శకుడిగా రూపొందు తున్న చిత్రం 'కృష్ణారావు సూపర్ మార్కెట్'. హీరోయిన్గా ఎల్సా నటిస్తున్న ఈ చిత్రం బి.జె.ఆర్. ఫిల్మ్స్ అండ్ టీవీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనాధ్ పులకరం మాట్లాడుతూ, 'ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకిది మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమవుతుంది. అలాగే హీరోయిన్ ఎల్సా కూడా బాగా నటించింది. ఇద్దరు డేడికేటెడ్ ఆర్టిస్టులు. ప్రస్తుతం థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కంటెంట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు. 'ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాతలు అన్నారు.