Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ 'అరుంధతి'గా కరీనా కపూర్ త్వరలోనే ప్రేక్షకుల్ని భయపెట్టడంతోపాటు మెస్మరైజ్ చేయబోతున్నట్టు సమాచారం. అనుష్క కథానాయికగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'అరుంధతి' తెలుగులో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో అనుష్క తెలుగులో తిరుగులేని
అగ్ర కథానాయికగా ఎదిగారు. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం సంచలనం సృష్టించింది. అంతేకాదు తెలుగునాట మహిళా ప్రధాన చిత్రాల నిర్మాణానికి నాంది పలికింది. తాజాగా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అనుష్క పాత్రకి కరీనా కపూర్‌ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇదే సెట్ అయితే కరీనా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే, శనివారం పుట్టిన రోజు జరుపుకున్న కరీనా బాలీవుడ్లో బెబోగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. 'రావణ్', 'సింగం రిటర్న్స్', 'బాడీగార్డ్', '3 ఇడియట్స్', 'బజరంగీ భాయిజాన్', 'దేవ్', 'ఐత్రాజ్', 'ఓంకార' వంటి చిత్రాలతో అగ్ర నటిగా ఎదిగిన విషయం విదితమే. ప్రస్తుతం 'గుడ్ న్యూస్', 'ఆంగ్రేజి మీడియమ్'లో నటిస్తూ బిజీగా ఉన్నారు.