Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని, లావణ్య త్రిపాఠి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో, జిఎ2 పతాకంపై యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భలే భలే మగాడివోయ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈచిత్రం గురించి నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ, 'ఈచిత్రానికి గోపీసుందర్ అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. క్వాలిటీ విషయంలో భారీ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా డాల్బీ ఎట్మాస్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'నటించడానికి మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశాననే సంతృప్తితో ఉన్నాను. మారుతితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటాం. ఫ్యామిలీస్ అంతా థియేటర్స్‌కి వెళ్ళి చూడాల్సిన చిత్రం' అని హీరో నాని చెప్పారు. 'కథలో కామెడీ, క్యారెక్టర్స్‌లో కామెడీ ఉండటంతో ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది' అని దర్శకుడు మారుతి అన్నారు. మురళిశర్మ, నరేష్, సితార, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు.