Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిపల్లవి, ఫహద్ ఫాజిల్, ప్రకాష్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రధారులుగా వివేక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని అతిథి'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'అధిరన్'కు తెలుగు అనువాదం. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, '1970లో కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. సాయి పల్లవితోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి, అలాగే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'సాహో'కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించడం విశేషం. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 15న సినిమాని విడుదల చేయనున్నాం' అని అన్నారు. రెంజి పానికర్, లియోనా లిషోరు, శాంతి కృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: అయూబ్ ఖాన్, కెమెరా: అను మోతేదత్, సంగీతం: పి.ఎస్. జయహరి.