Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, హన్సిక హీరోహీరోయిన్లుగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఇందుమూరి శ్రీనివాసులు సమర్పణలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూప జగదీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి యూనిట్ చెబుతూ, 'పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిది. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తుంది. సినిమా చాలా బాగా వస్తుంది. సాయికార్తీక్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. అలాగే కెమెరామెన్ సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ కనువిందుగా ఉంటాయి. వరలక్ష్మి శరత్ కుమార్ స్ట్రెయిట్‌గా తెలుగులో నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్యకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: కిరణ్.
సంగీతం: రవిశంకర్.