Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సవ్యసాచి', 'మజ్ను' చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ 'ఇస్మార్ట్ శంకర్'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో అందరిని మెస్మరైజ్ చేసింది. దీంతో పలు క్రేజీ ఆఫర్స్ నిధిని వరిస్తున్నాయి. సినిమాలతోపాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించే ఛాన్స్‌లు నిధికి దొరకడం విశేషం. లేటెస్ట్గా ఓ మ్యూజిక్ ఆల్బమ్‌తో సందడి చేయబోతుంది. ప్రముఖ ర్యాప్ సింగర్, సంగీత దర్శకుడు బాద్షాతో కలిసి ఆల్బమ్‌లో నటించింది. అంతేకాదు అద్భుతమైన పాటల్లో స్టెప్పులేసి మ్యాజిక్ చేయబోతోంది. త్వరలోనే ఈ ఆల్బమ్ విడుదల కాబోతోంది. 'ఇస్మార్ట్ శంకర్'తో వచ్చిన సక్సెస్‌తో దక్షిణాదిలో పాపులర్ అయిన నిధి ఇటీవల తమిళంలో జయంరవి సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. దీంతోపాటు తెలుగులోనూ ఓ భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఏది ఏమైనా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇస్మార్ట్‌గా నిధి
ఉపయోగించుకుంటోందని వేరే చెప్పక్కర్లేదు.