Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒక నటిగా చాలా జాగ్రత్తగా డిఫరెంట్ స్క్రిప్ట్‌లని ఎంపిక చేసుకుంటాను. భిన్నమైన పాత్రలు నాకు ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయి. వాటిలోనే సవాల్ ఉంటుంది. అందుకే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు ఎంచుకుంటాను' అని అంటోంది శ్రద్ధా కపూర్. ఇటీవల 'సాహౌ', 'చిఛోర్'లతో వరుస విజయాలను అందుకుంది. ఈ రెండు చిత్రాలు భిన్నమైన నేపథ్యానికి చెందినవి కావడం ఓ విశేషమైతే, రెండూ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లని రాబట్టాయి. మరోవైపు ప్రస్తుతం 'స్ట్రీట్ డాన్సర్', 'బాఘి3' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తుంది. ఇలా భిన్నమైన సినిమాలు చేయడం గురించి శ్రద్ధా మాట్లాడుతూ, 'డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు, భిన్నమైన పాత్రలు సరికొత్త ఛాలెంజ్నిస్తుంటాయి. అలాంటి పాత్రలు చేసినప్పుడు మన నటనలోని భిన్న కోణాలు బయటకు వస్తాయి. అందుకే విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఎగ్జైట్ అవుతుంటాను. అంతేకాదు సినిమా విజయానికి కలెక్షన్లే కొలమానం. ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటే ఎక్కువ మంది సినిమాని చూశారని, ఎక్కువమంది ఇష్టపడ్డారని అర్థం. మంచి కలెక్షన్లు వచ్చినప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. ఉత్తేజాన్నిస్తుంటుంది. కాబట్టి బాక్సాఫీసు వసూళ్ళు కూడా ముఖ్యమే' అని తెలిపింది. శ్రద్ధా ప్రస్తుతం వరుణ్ ధావణ్‌తో కలిసి 'స్ట్రీట్ డాన్సర్', టైగర్ షరాఫ్‌తో కలిసి 'బాఘి 3'లో నటిస్తూ బిజీగా ఉంది.