Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా రూపొందుతున్న చిత్రం 'అలెగ్జాండర్'. ''ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, సహాయ నటుడిగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో, ఎన్నో విలక్షణమైన పాత్రలతో, ఎన్నో అవార్డులు, రివార్డులను జయప్రకాష్‌రెడ్డి అందుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా 'అలెగ్జాండర్' సినిమాను దర్శకుడు ధవళ సత్యం రూపొందిస్తున్నారు. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో జెపి ఒక్కరే నటిస్తుండటం విశేషం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని జయప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.