Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విభిన్న పాత్రలతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో మరో ప్రయోగాత్మక పాత్రతో సోనమ్ కపూర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంధురాలిగా వెండితెరపై మెరవనుంది. ఇటీవల సోనమ్ నటించిన 'ది జోయా ఫ్యాక్టర్' బాక్సాఫీసు వద్ద పరాజయం చెందిన విషయం విదితమే. కొంత గ్యాప్ తీసుకుని సౌత్ కొరియన్ సూపర్ హిట్ చిత్రం 'బ్లైండ్' హిందీ రీమేక్‌లో నటించబోతున్నారు. మహిళా ప్రధానంగా యాక్షన్ క్రైమ్ డ్రామాగా సాగే ఈ సినిమాలో సోనమ్ అంధురాలి పాత్రలో కనిపిస్తారట. షోమ్ మఖిజ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సుజరు ఘోష్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, 'నా స్నేహితుడు షోమ్ మఖిజ దీనికి దర్శకత్వం వహిస్తారు. ఇది పూర్తి మహిళా ప్రధానంగా సాగే చిత్రం. సోనమ్‌కి బాగా సూట్ అవుతుంది' అని తెలిపారు. 'ఇప్పటి వరకు యాక్షన్, హర్రర్ సినిమాలు చేయలేదు. ఈ రెండు జోనర్ సినిమాలు చేయడానికి ఆసక్తికరంగా, సిద్ధంగా ఉన్నాను' అని సోనమ్ తెలిపింది.