Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటిగా రాణించాలంటే తెలుగమ్మాయిలకు చాలా లిమిటేషన్స్, స్ట్రగుల్స్ ఉంటాయి. లిమిటేషన్స్కి తగ్గట్టుగానే మంచి పాత్రలు వస్తేనే చేస్తా. గ్లామర్ పాత్రలకు దూరం' అని అంటోంది హర్షితా చౌదరి. విశ్వంత్, హర్షితా చౌదరి జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రధారిగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తోలు బొమ్మలాట'. ఈనెల 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ హర్షితా చౌదరి గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేశాను. పీజీ చేయాలనే ఆలోచనలో ఉన్నా. మొదట పలు కమర్షియల్ యాడ్స్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు, ప్రొఫైల్ పెట్టాను. కాస్టింగ్ ఏజెంట్స్ ద్వారా ఈ ఆఫర్ వచ్చింది. నేను ప్రొఫెషనల్‌గానే ఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అందుకే వచ్చిన ఆఫర్స్‌లో మంచి సినిమా చేయాలని దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. సినిమా ఇండిస్టీలో ఉండే డార్క్ సైడ్ వాళ్ళకి తెలుసు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. అందుకే నాకు సపోర్ట్ చేశారు. నా తొలి సినిమానే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటూ మా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా చేయడం ఆనందంగా ఉంది. అందుకు లక్కీగా భావిస్తున్నా. యాడ్స్‌తో పోల్చితే సినిమా యాక్టింగ్ చాలా కష్టం. ఎంతో మంది ముందు, ఎన్నో కామెంట్స్‌ని తట్టుకుని కెమెరా ముందు నటించడం అంత ఈజీ కాదు. ఇదొక స్ట్రగులింగ్ జర్నీ. సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తాను. నా పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలాగని స్ట్రాంగ్ రోలేం కాదు. చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ప్రతి అమ్మాయికి రిలేట్ అయ్యేలా ఉంటుంది. రాజేంద్రప్రసాద్ వంటి పెద్ద ఆర్టిస్టులతో కలిసి నటించాలంటే మొదట భయమేసింది. వారి సపోర్ట్‌తో బాగానే నటించగలిగాను. ఇదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. సినిమా చూసుకున్నాక ఇంకా బాగా చేయాల్సిందని పించింది. నెక్ట్స్ టైమ్ దాన్ని అధిగమిస్తాననుకుంటున్నా. డైరెక్టర్ చాలా కూల్ పర్సన్. తొలి సినిమానే ఫ్యామిలీ డ్రామా కథాంశాన్ని ఎంచుకోవడం విశేషం. డైలాగ్‌లు, కథలో చాలా డెప్త్ ఉంటుంది. విశ్వంత్ బాగా సపోర్టివ్. మంచి కోస్టార్. సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. నటిగా నాకు సౌందర్య, సావిత్రి అంటే చాలా ఇష్టం. ఇకపై కూడా
నేను సెలక్టీవ్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నా. డ్రెస్సింగ్, ఇంటిమసీ విషయంలో తెలుగమ్మాయిలకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు చేస్తాను. వచ్చిన, నచ్చిన సినిమాలే చేస్తాను. కొత్తగా వచ్చే వారికి అవకాశాలు
రావడమే గొప్ప. మహిళ ప్రధాన పాత్రలు రావడం కష్టం. దానికి చాలా అనుభవం కావాలి' అని చెప్పారు.