Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వెంకీమామ'. ఇటీవల టైటిల్ సాంగ్‌ని విడుదల చేయగా, తాజాగా మరో పాటని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, 'ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్‌కి విశేష శ్రోతకాదరణ లభించింది. నేడు రెండో పాటని విడుదల చేస్తున్నాం. 'ఎన్నాళ్ళకో..' అంటూ సాగే పాటకి సంబంధించిన పోస్టర్ని శుక్రవారం విడుదల చేశాం. ఇందులో వింటేజ్ లుక్‌లో వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ ఆకట్టుకుంటున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెట్రో సాంగ్ ఇది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి మంచి బాణీలను సమకూరుస్తున్నారు. ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది' అని తెలిపింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: ప్రవీణ్ పూడి.