Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భావోద్వేగాలు యూనివర్సల్ పాయింట్. 'తోలుబొమ్మలాట'లో అది నాకు బాగా నచ్చింది. మన మూలాలను, అనుబంధాలను తెలిపే చిత్రమిది' అని హీరో విశ్వంత్ అన్నారు. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, హర్షిత చౌదరి ప్రధాన పాత్రధారులుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విశ్వంత్ మాట్లాడుతూ, ''జెర్సీ' టైమ్‌లో ఈ ఆఫర్ వచ్చింది. దర్శకుడు విశ్వనాథ్ మోహమాటంగా కథ చెప్పినా, చాలా బాగా చెప్పాడు. నాకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా, 'జెర్సీ'కి డేట్స్ క్లాష్ అవుతున్నాయి. మంచి సినిమాలని వదులుకోకూడదనుకుని రెండింటిని మ్యానేజ్ చేసి చేశా. ఒక కథ ఓకే చేయడానికి ఒకటికి మూడు సార్లు చదివిగాని ఓకే చేయను. ఎందుకంటే సినిమా కోసం చదువు, అమెరికా అన్ని వదిలేసుకున్నా. మంచి సంపాదన వద్దనుకుని మంచి సినిమాలు చేయాలని వచ్చా. ఏదో ఒక సినిమా చేయాలనుకోవడం లేదు. మంచి సినిమాలను మిస్ చేసుకోను. ఇందులో హీరోహీరోయిన్లు ఉండరు. అందరూ క్యారెక్టర్స్గానే కనిపిస్తారు. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాలో కథకు తగ్గట్టుగా పాత్రలుండాలి. దీన్ని నేను బాగా నమ్ముతాను. హీరోహీరోయిన్ పాత్రల కంటే కథ గొప్పది. పాత్రలు తమ పరిధిలోనే ఉంటాయి. ఆ పరిధి దాటితే సినిమా పోయినట్టే. ఒక ఫ్యామిలీలో అందరూ ఒకే చోట కలవడానికి వస్తారు. ఎవరు చూపించని యూనిక్ పాయింట్‌ని ఇందులో చూపించాం. కొన్ని రోజులు జరిగే జర్నీలో మనుషులు ఏ విధంగా మారిపోతారు అనే కాన్సెప్ట్‌ని హైలెట్‌గా చూపించాం. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన చిత్రమిది. ''గొప్పదిరా మనిషి పుట్టుక'' అనే సాంగ్ రిలీజ్ చేశాం. ఈ పాటతో సినిమా భావం ఏమిటో అందరికి అర్థమై ఉంటుంది. ఎప్పటికైనా అందరూ వెళ్లిపోవాల్సిందే.. మధ్యలో జరిగే నాటకమే జీవితం అనే లైన్ ఆకట్టుకుంటుంది. సినిమాలో మంచి ఎమోషన్, బావ మరదలి మధ్య ప్రేమ, వారిద్దరికీ పెళ్లి చేయాలనే కోరుకునే తాత, ఇలా సాగుతున్న క్రమంలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ యాక్టర్‌తో నటించడం లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. ఆయనతో కామెడీ చేయడం చాలా కష్టం. దర్శకుడు విశ్వనాథ్కిది తొలి చిత్రమైనా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. భవ్య క్రియేషన్‌లో బ్యూటిఫుల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నా. 'కాదల్' అనే మరో సినిమా చేస్తున్నా. ఆ తరువాత 'కాకినాడ కుర్రోడు' అనే డిఫరెంట్ సినిమాతో వస్తాను. హీరోగానే కాదు, మంచి పాత్రలు వస్తే ఇతర హీరోల సినిమాల్లోనైనా నటిస్తాను' అని అన్నారు.