Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతన్ మద్దినేని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'బీచ్ రోడ్ చేతన్'. తేజారెడ్డి కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ, 'రాగా, రియలిస్టిక్‌గా ఉండే మంచి కథని ప్రేక్షకులకు చెప్పాలని దర్శకుడిగా మారాను. ఈ నెల 22న సినిమాని విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షోకి టికెట్స్ అన్నీ ఫ్రీగా అందిస్తున్నాం.
చిన్న సినిమాలకు జనాలు రావడం కష్టం. బాగుందనే టాక్ వస్తేనే వస్తారు. మొదటి రోజు వచ్చేవాళ్ళు కేవలం సినిమా లవర్స్ మాత్రమే. వారికోసం ఫ్రీగా టికెట్స్ ఇవ్వాలనుకున్నా. విడుదలైన అన్ని థియేటర్లలో ఫస్ట్ షో టికెట్లని ఉచితంగా పొందొచ్చు. రియలిస్టిక్ కథాంశంతో చాలా రా, మాస్‌గా ఈ సినిమాని రూపొందించాం. షూటింగ్ కూడా డిఫరెంట్‌గా చేశాం. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని కచ్చితంగా చెబుతాను.ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'అందరు కలలు కంటారు. దాన్ని సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. కష్టపడే వారికి ఓ అవకాశం ఇవ్వాలి. ఈ సినిమా ద్వారా చేతన్ ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో నేను విలన్‌గా నటిస్తున్నాను. దీనితో నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నా. బాగా చదువుకుని, తెలివైన కుర్రాడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఓ సందర్భంలో మంచి పనిచేయాలని ఆతృత పడుతుంటాడు. ఆ మంచి పనికోసం పరిగెత్తే కుర్రాడే 'బీచ్ రోడ్ చేతన్'. చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అని నిర్మల్ భాను తెలిపారు. షేక్ రహీమ్ చెబుతూ, 'ఈ సినిమాతో చేతన్ నాకు లైఫ్ ఇచ్చాడు. కచ్చితంగా సినిమా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది' అని చెప్పారు.