Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లా లెయితే హీరోహీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం రూపొందుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమా రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఇందులో పలు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఆయన పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుంది. క్రాంతి మాధవ్ టేకింగ్ మెప్పిస్తుంది' అని తెలిపింది.