Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' చిత్రం రూపొం దుతుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తు న్నారు. ఇందులో కీలక పాత్రలో బాలీవుడ్ నటి దియా మీర్జా నటిస్తున్నారు. ఆ విశేషాలను చిత్ర యూనిట్ చెబుతూ, 'ఇటీవల రిలీజ్ చేసిన చిత్ర ఫస్ట్‌లుక్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. పోలీస్ శాఖలో అందరూ 'వైల్డ్ డాగ్' అని పిలుచుకునే అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజరు వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన ఈ చిత్రంలోని వైల్డ్ డాగ్ విజరు వర్మ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ పాపులర్ నటి దియా మీర్జా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఎంపిక చేశాం. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. త్వరలోనే దియా మీర్జా పాల్గొనే సన్నివేశాలు ప్రారంభం కానున్నాయి' అని చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, ఎడిటర్: శ్రావణ్ కటికనేని, ఆర్ట్: మురళి ఎస్.వి.