Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రివిక్రమ్ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి సీజనల్‌గా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమా ఎవరితో అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. చిరంజీవితో ఓ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అటు చిరంజీవి, ఇటు త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రాక్‌లోకి ఎన్టీఆర్ వచ్చారు. త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ఇది. జులై 30న దీన్ని విడుదల చేయాలనుకున్నప్పటికీ, తాజాగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సమ్మర్ వరకు చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమ్మర్ నుంచి త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని, మరోసారి హిట్ కొట్టాలని అటు త్రివిక్రమ్, ఇటు ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో 'అరవింద సమేత' వచ్చి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఇటీవల రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది. ఈ చిత్రం పూర్తవడానికి దాదాపు ఏడాది టైమ్ పడుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాలని చిరు భావిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో రూపొందే చిరు చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ సామాజిక ఇతివృత్తంతో వినోదం, వాణిజ్య అంశాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, ఇందులో చిరు ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్టు టాక్.