Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ అభిరామ్.ఎం దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎం.వి.టి ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్. సినిమా మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ, 'థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభవం ఉన్న నటుడిలా అద్భుతంగా నటించాడు. దర్శకుడు అభిరామ్ మేకింగ్ ఫ్రెష్‌గా ఉంది. సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ బ్యూటీఫుల్ విజువల్స్, రైటర్ తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్.ఆర్, ఆర్ట్: నరేష్ బాబు తిమ్మిరి.