Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత గ్యాప్ తర్వాత మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అహం బ్రహ్మాస్మి'. శ్రీకాంత్.ఎన్.రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో ఎం.ఎం.ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవితో కలిసి మంచు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం సినిమాని ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారు. తాజా టైటిల్ లోగోని విడుదల చేశారు. టైటిల్ తరహాలోనే, పోస్టర్ సైతం ఉత్తేజభరితంగా ఉంది. మార్చి 6న సినిమాని గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ స్పందిస్తూ, 'మూడేండ్ల తర్వాత మీ దగ్గరకు వస్తున్నాను. నా తొలి చిత్రం 'దొంగ దొంగది' సమయంలో ఎలాంటి ఉద్వేగాన్ని ఫీల్ అయ్యానో ఇప్పుడూ అదే భావోద్వేగంతో ఉన్నా. ఈ జర్నీ మొత్తం తెరపైనా, తెర బయటా మీరు నాపై చూపించిన ప్రేమకు, మీరిచ్చిన సపోర్టుకూ థ్యాంక్స్. నా లైఫ్ అయిన నా కళ (ఆర్ట్)ను నేను మిస్సయ్యాను. సినీ అమ్మ. వచ్చేశా. లవ్ యు ఆల్ డార్లింగ్స్. 'అహం బ్రహ్మాస్మి' అంటూ ట్విట్టర్ ద్వారా చిత్ర పోస్టర్ని పంచుకున్నారు.