Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర, గాయత్రి ఆర్ సురేష్, క్రిష్ సిద్దిపల్లి, అదితి హీరోహీరోయిన్లుగా సురేష్ దర్శకత్వంలో 'నేను లేని నా ప్రేమ కథ' చిత్రం రూపొందుతుంది. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కళ్యాణ్ కందుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని ప్రేమికుల రోజుని పురస్కరించుకుని శుక్రవారం నిర్మాత దిల్‌రాజు విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందిం చారు. ఈ సందర్భంగా నిర్మాత కళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ, ''దిల్ రాజు మా సినిమా ఫస్ట్ లుక్‌ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథలు తెరపై ఇప్పటికే అనేకం కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది. ఈ విభిన్న ప్రేమ కథని చూసిన ప్రతి ఒక్కరూ వారి వారి ప్రేమ కథకి దగ్గరవుతారు. నవీన్ చంద్ర, హీరోయిన్ గాయత్రి ఆర్ సురేష్ వారి పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. రాజారవీంద్ర, బందు దివిజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా.. ఎస్.కె.ఏ.భూపతి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం.. జువెన్ సింగ్.