Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్ళి తర్వాత సోనమ్ కపూర్ నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. గతేడాది చేసిన 'ఏక్ లడక్కీ కో దేఖా తో హైసా లగా', 'ది జోయా ఫ్యాక్టర్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. దీంతో కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. తాజాగా ఆమె ఓ కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించింది. ప్రముఖ షూటర్, ఒలంపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ''ది బిద్రా బయోపిక్' ఒక ప్రత్యేకమైన చిత్రమవుతుందని చెప్పొచ్చు' అంటూ తండ్రి అనిల్ కపూర్, సోదరుడు హర్షవర్ధన్ కపూర్,
అభినవ్ బింద్రాలు బ్లాక్ డ్రెస్‌లు ధరించి దిగిన ఫొటోని అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి అభినందనలు తెలిపింది. ఇందులో షూటర్ అభినవ్ బింద్రాగా తన సోదరుడు హర్షవర్థన్ కపూర్ నటిస్తుండటం విశేషం. అభినవ్ ఒలంపిక్ ఛాంపియన్‌గా, వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన
తొలి ఇండియన్ షూటర్ కావడం విశేషం. మరి ఇందులో సోనమ్ కపూర్ నటిస్తుందా? లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.