Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో అజిత్ గాయపడ్డారు. ప్రస్తుతం నటిస్తున్న 'వాలిమై' చిత్ర షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగి స్వల్పంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అజిత్ తన 60వ చిత్రంగా హెచ్.వినోద్ దర్శకత్వంలో 'వాలిమై' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్లో భాగంగా పలు కీలక యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. బైక్ ఛేజింగ్‌లో భాగంగా ప్రమాదం జరిగిందట. ప్రమాదం విషయం తెలిసి ఆయన అభిమానులు అజిత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.