Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) నా బర్త్‌డేని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఎక్కడా కూడా నా బర్త్‌డే వేడుకలు జరుపవద్దని అభిమానుల్ని కోరుకుంటున్నా. అంతే కాదు, లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో కాలు మీద కాలేసుకుని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లుః అని నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.